చోరీలకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు

చోరీలకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు

VZM: కదులుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడిన ఛత్తీస్ ఘర్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీరావు గురువారం తెలిపారు. వారివద్ద నుంచి, ప్రయాణికుల నుండి చోరీలు చేసిన సుమారు రూ 1 లక్ష విలువైన మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆనంతరం రిమాండ్ నిమిత్తం విశాఖ రైల్వేకోర్టుకు తరలించామని పేర్కొన్నారు.