భద్రకాళీ స్వామికి వెండి బిస్కెట్ బహుకరణ
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి కర్ణాటక, బెంగళూరు నివాసి వీరప్ప కొట్రప్ప ఆదివారం 1 కేజీ వెండి బిస్కెట్‌ను బహుమతిగా అందజేశారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహణాధికారి డీవీ రమణారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు వీరప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందించారు.