ఏనుగు దాడి.. ముగ్గురు మృతి
ఒడిశా కొందమాల్ జిల్లా రైకియా సమితిలోని రెండు వేర్వేరు అటవీ ప్రాంతాల్లో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఏనుగు దాడిలో చికిత్స పొందుతూ ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులు దురి ప్రధాన్, కీర్తన బగార్త్, బామదేవ్ ప్రధాన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.