VIDEO: బీఆర్ఎస్ నాయకులపై క్రిమినల్ కేసులు తగదు
HNK: రైతులకు యూరియా అందించాలని ఆందోళన చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పోలీసులను నిలదీశారు. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.