VIDEO: లక్ష గాజులతో చండిక అమ్మవారికి విశేషాలంకరణ

VIDEO: లక్ష గాజులతో చండిక అమ్మవారికి విశేషాలంకరణ

JN: పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష గాజులతో చండిక అమ్మవారికి విశేషాలంకరణ చేశారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చన చేసిన అమ్మవారి ప్రతిరూపం భక్తులను ఆకట్టుకుంది. స్వామి వారికి లక్ష బిల్వర్చన, రుద్రహవనం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో సల్వాది మోహన్ బాబు, అర్చకులు తదితరులున్నారు.