పిడుగు పడి మూడు గేదెల మృతి

KMM : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి మూడు గేదెలు పిడుగు పడి మృతి చెందాయి. శుక్రవారం ఉదయం మృతి చెంది ఉన్న గేదెలను గ్రామస్తులు గుర్తించారు. గేదెల మృతితో ఆర్థికంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.