'బాన్సువాడ నుంచి బెంగళూరుకు ప్రత్యేక బస్సు'
KMR: బాన్సువాడ నుంచి బెంగళూరుకు ప్రత్యేక లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రవి కుమార్ శనివారం తెలిపారు. బోధన్ డిపోకు చెందిన బస్సు మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుందని ఆయన చెప్పారు. ఈ బస్సు జేబీఎస్, ఎంజీబీఎస్, అనంతపూర్, కర్నూల్ మీదుగా బెంగళూరు చేరుకుంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.