ఎమ్మెల్యే పాయం నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే పాయం నేటి పర్యటన వివరాలు

BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ఆళ్లపల్లి, మణుగూరు మండలాల్లో పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఉదయం 10 గంటలకు రాయపాడు, అనంతోగు, ఆళ్లపల్లి పంచాయితీల్లో సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. అనంతరం ఆళ్లపల్లి రైతు వేదికలో నూతన రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ సాయం, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నారు.