నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టు సంఘాల నిరసన

MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో జర్నలిస్టు సంఘాలు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి భయ బ్రాంతులకు గురి చేసిన పోలీసుల చర్యలను జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ఖండించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.