కాంగ్రెస్ హామీల అమలుపై మాజీ ఎమ్మెల్యే విమర్శ
MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, అమలు కానివే ప్రజల ముందుకు తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి విమర్శించారు. సోమవారం మూసాపేట్ మండలంలోని సంకల మద్ది, జానంపేట తదితర గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికేనని అన్నారు.