'అభివృద్ధికి నిధులు కేటాయించాలి'
ELR: గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు నారాయణపురం గ్రామ సర్పంచ్ దిడ్ల అలకనంద కోరారు. బుధవారం ఉంగుటూరు మండలం నారాయణపురం వచ్చిన మంత్రికి సర్పంచి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, కూటమి నాయకులు తదితరులు ఉన్నారు.