IPL: డిఫెండింగ్ టీమ్ కెప్టెన్ వచ్చేశాడు
IPL 2026లో తమ తొలి ట్రోఫీని విజయవంతంగా డిఫెండ్ చేయాలనే దృఢ సంకల్పంతో కెప్టెన్ రజత్ పాటీదార్ RCB జట్టుతో చేరాడు. ఈ మేరకు 'లెవెల్ అప్ అయ్యేందుకు కెప్టెన్ వచ్చేశాడు' అంటూ RCB ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. 18 ఏళ్ల కలను నిజం చేసి, తమకు తొలి ట్రోఫీ అందించిన రజత్ సారథ్యంలో నడిచేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.