మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరులు అరెస్ట్

AP: రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. రామగిరి హెలిప్యాడ్ వద్ద పోలీసులపై దాడి ఘటనలో ఈ అరెస్టులు జరిగాయి. ఈ కేసులో 10 మంది YCP నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరికొందరి కోసం గాలిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్, ఆయన సోదరులు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో, ఏపీ పోలీసులు వారిని పట్టుకోవడానికి HYDకు చేరుకున్నారు.