'నేరస్తుల్లో మార్పు కోసం వినూత్న ప్రయత్నం'

'నేరస్తుల్లో మార్పు కోసం వినూత్న ప్రయత్నం'

VSP: నేరస్తుల్లో మార్పు తీసుకురావడానికి విశాఖ పోలీసులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో విశాఖ పోలీసులు, VCSC సంయుక్తంగా కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 78 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పునరావాసం, సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపడానికి మార్గదర్శనం చేశారు.