సముద్రంలో మునిగిపోయిన మత్స్యకార బోటు

VSP: విశాఖపట్నంలో ఒక ఫిషింగ్ బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. అయితే అందులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. శుక్రవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఐఎన్‌డీ ఏపీబీ 5 యంయం 817 అనే ఫిషింగ్ బోటులోకి అనుకోకుండా నీరు చేరడంతో అది మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.