పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పంకజ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు.