అర్హులకే పెన్షన్లు: మంత్రి పార్థసారథి

AP: దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్ కట్ చేస్తోందంటూ రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పార్థసారథి స్పందించారు. పెన్షన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలనలో డబ్బులతో నకిలీ పెన్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నవాళ్లకు పెన్షన్ ఇస్తామన్నారు. వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.