రోడ్డు ప్రమాదం.. 9 గొర్రెలు మృతి

రోడ్డు ప్రమాదం.. 9 గొర్రెలు మృతి

ATP: బొమ్మనహల్ మండలం నియమకల్లు గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం గొర్రెల మందను ఢీకొనగా 9 గొర్రెలు మృతి చెందాయి. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నబీ రసూల్ తెలిపారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.