ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
VZM: ఎల్.కోట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్వయంగా పాల్గొని, ప్రజల సమస్యలను ఓపిగ్గా ఆలకించారు. ప్రజా దర్బార్‌లో మొత్తం 46 వినతులను ఆమె స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.