జాతీయ జెండా ఎగురవేయనున్న మంత్రి

KDP: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ శుక్రవారం కడపకు రానున్నారు. ఉదయం కడప పోలీస్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయ జెండా ఎగురువేయడంతో పాటు జిల్లా ప్రగతి అభివృద్ధిపై తన సందేశం వినిపిస్తారని కలెక్టర్ శ్రీధర్ గురువారం తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలు తదితరులు పాల్గొననున్నారు.