బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ఆస్తుల చిట్టా!

బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ఆస్తుల చిట్టా!

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన నితిన్ నబిన్ సిన్హా ఆస్తుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. ఆయన మొత్తం ఆస్తులు రూ.3.10 కోట్లు కాగా, అప్పులు మాత్రం ఏకంగా రూ.56.7 కోట్లు ఉన్నాయి. ఆయన చేతిలో కేవలం రూ.35 వేల నగదు ఉంది. అయితే 7 బ్యాంకు ఖాతాలు, రూ.38 లక్షల విలువైన రెండు కార్లు(స్కార్పియో, ఇన్నోవా), LIC పాలసీలు, బంగారు నగలు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.