జనగణనపై ఉపాధ్యాయులకు శిక్షణ

జనగణనపై ఉపాధ్యాయులకు శిక్షణ

VKB: జనగణనపై ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చే కార్యక్రమం బొంరాస్‌పేట జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమైంది. తహసీల్దార్ పద్మావతి, ఎంఈవో హరిలాల్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు జనగణన పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులకు ఆర్పీలు అన్వర్, కరుణాకర్ రెడ్డి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.