VIDEO: జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

VIDEO: జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని సర్సిల్క్‌లో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు భాజపా జెండాను ఇవాళ ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. అనేక మంది త్యాగధనుల పోరాటాల ఫలితంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. గ్రామ గ్రామాన, వీధి వీధిలో పార్టీ మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.