VIDEO: ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని గోయగం పంచాయతీ ఎన్నికల్లో 100 ఏళ్ల వృద్ధురాలు మారుబాయి గురువారం తన ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. వయస్సు పైబడినప్పటికీ ఆసక్తిగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడం స్థానికులకు స్ఫూర్తినిచ్చింది. అధికారులు ఆమెకు సహాయం అందించారు. ఓటు పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.