విద్యుత్ తీగలకు అల్లుకుపోతున్న కొమ్మలు

విద్యుత్ తీగలకు అల్లుకుపోతున్న కొమ్మలు

SRPT: మునగాల మండలంలోని ఆకుపాముల నుంచి కోదండ రామాపురం వెళ్లే రహదారిపై విద్యుత్ స్తంభాలను చెట్ల కొమ్మలు చుట్టేస్తున్నాయి. దట్టమైన కొమ్మలు 11 కేవీ తీగలకు అల్లుకుపోవడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వేసవిలో విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండాలంటే, అధికారులు వెంటనే స్పందించి ఆ కొమ్మలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.