'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

ASR: జీ.మాడుగుల మండలంలోని మద్దిగరువు వారపు సంతను గురువారం ఎస్సై సాయిరామ్ పడాల్‌తో కలిసి సోషల్ మీడియా సీఐ వెంకటరమణ, ఎన్‌డీపీఎస్ సీఐ ఆంజనేయులు సందర్శించారు. వారపు సంతకు వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన మెసేజ్‌లపై క్లిక్ చేయవద్దన్నారు.