ప్రజావాణి కార్యక్రమంలో 94 దరఖాస్తులు

HNK: జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజల నుంచి 94 దరఖాస్తులను స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి. గణేశ్, పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారులు రమేశ్ రాథోడ్, పాల్గొన్నారు.