పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

HYD: చిల్కానగర్ డివిజన్‌లో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి మాట్లాడుతూ.. చిల్కానగర్ డివిజన్‌లోని సాయిరాం నగర్ కాలనీలో నూతన సీసీ రోడ్డుకు శంకుస్థాపన అదేవిధంగా కుమ్మరి గ్రేవియార్డు ప్రారంభోత్సవము చేయడం జరిగిందని తెలిపారు.