సీక్వెంట్ సైంటిఫిక్ పేరు మార్పు
సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్ పేరు మారనుంది. ఆ సంస్థకు వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ అనే పేరును ఖరారు చేస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లో మార్పులు ప్రతిపాదించారు. కాగా, సీక్వెంట్ సైంటిఫిక్‌లో వియాష్ లైఫ్‌సైన్సెస్ విలీనం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.