సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ తనిఖీ చేసిన కలెక్టర్

సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ తనిఖీ చేసిన కలెక్టర్

 NZB: జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌ను (సీడీఎస్) కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులకు అనుగుణంగా ఔషధ నిల్వలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.