VIDEO: ‘అరైవ్–అలైవ్’లో వినూత్న అవగాహన కార్యక్రమం
WGL: వర్ధన్నపేట పట్టణంలో జాతీయ రహదారిపై శనివారం పోలీసులు ‘అరైవ్ -అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వినూత్న రీతిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు పోలీసులు గులాబీ పూలు అందించి, భద్రతా పరికరాల వినియోగంపై సూచనలు చేశారు. కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని అవగాహన కల్పించారు.