సర్వేయర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

VZM: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం గంట్యాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సర్వేయర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి పలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సర్వేయర్స్ అసోసియేషన్ గంట్యాడ మండల శాఖ అధ్యక్షుడు కెల్ల శివ, కార్యదర్శి సింగంపల్లి సురేష్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.