ఛలో జనగామను విజయవంతం చేయాలని పిలుపు

JN: సెప్టెంబర్ 17న చలో జనగామ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తెలిపారు. చిల్పూర్ మండలం కృష్ణాజి గూడెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని, అమరవీరుల త్యాగాలను గుర్తుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు.