VIDEO: మాజీ డీజీపీకి ఘన నివాళులు
VSP: మాజీ డీజీపీ హెచ్.జే దొరకు ఉత్తరాంధ్ర రిటైర్డ్ పోలీసు అధికారులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐజీపీ లక్ష్మణ్ మోహన్, రిటైర్డ్ ఎస్పీ శామ్యూల్ ప్రసాద్, సురేష్ బాబు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జర్గంగి వంటి మారుమూల ప్రాంతంలో జన్మించి ఉన్నత స్థాయికి ఎదిగిన హెచ్.జే దొర దేశానికి ఆదర్శమని రిటైర్డ్ ఎస్పీ సురేష్ బాబు కొనియాడారు.