చీరాల బీచ్ తాత్కాలికంగా మూసివేత
AP: ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణ పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారాయి. తుఫాన్ ప్రభావంతో చీరాల తీరప్రాంతాల్లో సముద్రం ఉద్ధృతంగా మారి గాలివానలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు చీరాల బీచ్‌ను తాత్కాలికంగా మూసివేశారు.