అత్తింటి వేధింపులు.. 8 మందిపై కేసు నమోదు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఓ వివాహిత భర్త, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన రంగారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. అత్తింటివారి వేధింపులు, భర్త మరో వివాహనికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఫిర్యాదు చేయడంతో, భర్తతో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.