ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి: DRDO
PPM: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం. సుధారాణి తెలిపారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మండలం బాలగుడబలో పర్యటించారు. సచివాలయంలో మొక్కలు నాటి, క్లాప్ మిత్రులకు సన్మానం చేపట్టారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.