శ్రీశైలంలో యువకుడిపై ఎలుగుబంటి దాడి
KRNL: శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లిన ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. హటకేశ్వరం గిరిజనగూడెనికి చెందిన చిన్నదేవయ్య శ్రీశైలం దర్శనానికి వెళ్లాడు. ఈ క్రమంలో అడవిలో కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్లిన చిన్నదేవయ్యపై ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటనపై ఆరా తీసిన ఫారెస్ట్ అధికారులు.. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.