VIDEO: అటవీ సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన

VIDEO: అటవీ సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన

ప్రకాశం: అర్ధవీడు మండలంలోని దొరకండ గ్రామంలో శనివారం రాత్రి అటవీ శాఖ అధికారులు అడవుల సంరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ అధికారి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. చెట్లను నరికి వేయడం, వన్యప్రాణుల వేట, అడవికి నిప్పంటించడం ఇలాంటి తప్పిదాలు చేయడం వల్ల విధించే శిక్షలను గురించి వివరించారు. అటవీ సంరక్షణ మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.