ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
KNR: కరీంనగర్ స్వశక్తి కళాశాలలో చీరల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆడ బిడ్టలకి సారె క్రింద చీరెలు ఇచ్చే సంప్రదాయాన్ని మొట్టమొదటి సారిగా కేసీఅర్ ప్రారంభించారన్నారు. కేసీఅర్ మొదలుపెట్టిన సంప్రదాయాన్నికొనసాగిస్తున్నందుకు సీఎం రేవంత రెడ్డికి అభినందనలు తెలిపారు.