రేపటి నుంచి ‘గాంధీ శిల్ప్‌ బజార్‌’ హస్తకళల ప్రదర్శన

రేపటి నుంచి ‘గాంధీ శిల్ప్‌ బజార్‌’ హస్తకళల ప్రదర్శన

EG: రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో సోమవారం నుంచి ‘గాంధీ శిల్ప్ బజార్’ హస్తకళల ప్రదర్శన ప్రారంభం కానుంది. ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 21వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. మంత్రి ఎస్.సవిత ప్రదర్శనను ప్రారంభిస్తారని సంస్థ వైస్ ఛైర్మన్, MD విశ్వ తెలిపారు. హస్తకళాకారుల నైపుణ్యాల ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.