వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
BDK: భద్రాచలంలో ఇవాళ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజల అనంతరం అర్చకులు వేద మంత్రాల సాక్షిగా ఈ క్రతువును పూర్తి చేశారు. భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం కనులారా వీక్షించి తరించారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది.