రూ. 50 వేల ఇంజెక్షన్‌తో ప్రాణాలను కాపాడిన వైద్యులు

రూ. 50 వేల ఇంజెక్షన్‌తో ప్రాణాలను కాపాడిన వైద్యులు

E.G: కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అశోక్ జైస్వాల్‌ను గుండెపోటుతో ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు. తీవ్ర గుండెనొప్పితో బాధపడుతున్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నాగరాజు, పూజిత పరీక్షలు నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 50 వేల రూపాయలు ఖర్చయ్యే మందును ప్రభుత్వ సౌకర్యం ద్వారా ఉచితంగా అందించి ప్రాణాలను కాపాడారు.