కృత్తివెన్ను తహసీల్దార్‌గా శశికుమార్

కృష్ణా: కృత్తివెన్ను డిప్యూటీ తహసీల్దార్ ఎల్. శశికుమార్ పదోన్నతి పొందారు. ప్రభుత్వం ఆయనను రెగ్యులర్ తహసీల్దార్‌గా నియమించింది. గురువారం ఆయన కృత్తివెన్ను తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. శశికుమార్ ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.