భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం నాడు భక్తజనసంద్రంగా మారింది. కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది భక్తులు రాజన్నను దర్శించుకొని తరించారు. ప్రధాన ఆలయంలో సాధారణ దర్శనాలు మాత్రమే అనుమతించడంతో రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. అనంతరం భీమన్న ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు.