'బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది'
MNCL: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని జన్నారం మండల నాయకులు అన్నారు. మండలంలోని ఇందన్ పల్లి గ్రామ 10వ వార్డు సభ్యులు చుంచు లక్ష్మీ మహేష్ సోమవారం జన్నారంలో BRS పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు ఫజల్ ఖాన్, మాజీ కోఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.