బ్రాహ్మణులకు MLA మందుల సామేల్ క్షమాపణ
NLG: బ్రాహ్మణులు మరియు వేద మంత్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇవాళ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తన మాటలు ఉద్దేశపూర్వకమైనవి కావని, ప్రసంగం మధ్యలో అలవాటుగా కొన్ని మాటలు దొర్లాయని ఆయన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వల్ల బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతింటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు ప్రకటించారు.