'నన్ను గెలిపిస్తే గ్రామంలో ATM ఏర్పాటు చేస్తా'
SRD: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి మండలం గౌడిచెర్లలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి సృజన జోగిరెడ్డి కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తున్నారు. తాను గెలిస్తే ఏటీఎం మిషన్, సమస్యల పెట్టె, ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి సదుపాయాలను కల్పిస్తానని 15 అంశాల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. స్థానికంగా ఇది వైరల్ అవుతుంది.