ఉప్పల్ రోడ్డులో ట్రాఫిక్ జామ్..!

మేడ్చల్: ఉప్పల్ నుంచి నారపల్లి, మేడిపల్లి నుంచి ఉప్పల్ వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకల సంఖ్య పెరగటంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. పట్నం నుంచి పల్లెకు వెళ్లే వారి సంఖ్య పెరగటం, రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారడంతో ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు, అధికారులు చర్యలు చేపడుతున్నారు.