'మూడు ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించాం'
కోనసీమ: ఐ.పోలవరం మండలంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను మూడు బ్లాక్ స్పాట్స్ గా గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఐ.పోలవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాంతాలలో గత మూడేళ్లలో వివిధ ప్రమాదాలలో 24 మంది మరణించారన్నారు. గోదావరిలోకి దూకి ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారని, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.